Tue Nov 05 2024 23:31:28 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్క విద్యార్థి కోసం స్కూల్ నడుపుతున్నారు.. 12 కిలోమీటర్ల నుండి వస్తోన్న టీచర్
ప్రస్తుతం ఆ స్కూల్ లో కార్తిక్ షెగ్ కర్ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. ఒక్క విద్యార్థే కదా అని..
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతుండేవి. ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా పెరిగిపోతుండటంతో.. ప్రభుత్వ పాఠశాలలు కళతప్పాయి. విద్యార్థులు లేక చాలా స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని స్కూల్స్ లో విద్యార్థులున్నా.. టీచర్ల కొరత ఏర్పడింది. కానీ.. మహారాష్ట్రలో ఒకే ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వ పాఠశాలను నడుపుతున్నారు. అతనికి చదువు చెప్పేందుకు 12 కిలోమీటర్ల నుండి టీచర్ వస్తున్నాడు. వాషిమ్ జిల్లాలోని గణేష్ పూర్ లో 150 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ స్కూల్లో 1 నుండి 4వ తరగతి వరకూ చదువు చెప్తున్నారు.
అయితే.. ప్రస్తుతం ఆ స్కూల్ లో కార్తిక్ షెగ్ కర్ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. ఒక్క విద్యార్థే కదా అని.. స్కూల్ ను ఇతర ప్రాంతాలకు తరలించకుండా కేవలం అతని కోసమే జిల్లా యంత్రాంగం ఆ స్కూల్ ను నడిపిస్తోంది. అంతేకాకుండా బాలుడికి మధ్యాహ్న భోజనంతోపాటు అన్ని వసతులు కల్పిస్తోంది. కార్తీక్ కు.. కిశోర్ మన్కర్ అనే వ్యక్తి చదువు చెప్తున్నాడు. అన్ని సబ్జెక్టులు ఆయనే చెబుతారు. కార్తీక్ క్రమం తప్పకుండా ప్రతిరోజూ స్కూల్ కి వస్తాడని, తామిద్దరం రోజూ ఉదయం ప్రార్థన చేస్తామని కిశోర్ తెలిపారు. రెండేళ్ల నుంచి అతను ఒక్కడే స్కూల్ లో పేరు నమోదు చేసుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు.
Next Story