Thu Apr 03 2025 00:47:04 GMT+0000 (Coordinated Universal Time)
మహాకుంభ మేళాలో తొక్కిసలాటతో ప్రభుత్వ కీలక నిర్ణయాలివే
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి ముప్ఫయి మంది మరణించడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి ముప్ఫయి మంది మరణించడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్ లను పూర్తిగా రద్దు చేసింది. అలాగే వాహనాల రాకపోకలపై కూడా నిషేధం విధించింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వాహనాలను...
భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పాటు మహా కుంభమేళాకు భారీగా తరలి వస్తారని భావించి ముందస్తు చర్యలను చేపట్టారు. కుంభమేళా జరిగే ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలను ఇక అనుమతించరు. ఈ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. మరోవైపు కుంభమేళాలో మృతి చెందిన వారి కుటుంబీలకు ఒక్కొక్కరికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
Next Story