వరుడిని చెట్టుకు కట్టేశారు.. ఎందుకో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దండలు మార్చుకునే ముందు అమ్మాయి కుటుంబం నుండి కట్నం డిమాండ్ చేసిన వరుడిని చెట్టుకు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దండలు మార్చుకునే ముందు అమ్మాయి కుటుంబం నుండి కట్నం డిమాండ్ చేసిన వరుడిని చెట్టుకు కట్టివేసారు. దీంతో పెళ్లికొడుకు అమర్జీత్ వర్మ చెట్టుకు కట్టేసి ఉండగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమర్జీత్ స్నేహితులు దురుసుగా ప్రవర్తించడం పరిస్థితికి మరింత ఆజ్యం పోసింది. వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం జరగడంతో వివాహ వేడుక రసవత్తరంగా మారింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా ఇరు కుటుంబాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో వధువు తరఫు వరుడిని బందీగా ఉంచి చెట్టుకు కట్టేసి ఉంచారు. ఈ ఘటన జూన్ 14న చోటు చేసుకుంది.
అనంతరం మంధాత పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పెళ్లికొడుకును విడిపించి అదుపులోకి తీసుకున్నారు. మాంధాత ఎస్హెచ్ఓ మాట్లాడుతూ.. ''ఇరువైపులా వర్గాలు పోలీసు స్టేషన్లో ఉన్నారు, కాని ఇంకా రాజీ కుదరలేదు. వరుడి స్నేహితులు దురుసుగా ప్రవర్తించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈలోగా పెళ్లికొడుకు అమర్జీత్ కట్నం కోసం డిమాండ్ చేశాడు. వివాహ వేడుక ఏర్పాట్లలో మహిళ తరపు వారి ఖర్చుల కోసం ఒక సెటిల్మెంట్కు, పరిహారం కోసం రెండు కుటుంబాల మధ్య సమావేశం కూడా జరుగుతోంది'' అని తెలిపారు.