Sat Nov 23 2024 07:17:39 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఆగని కరోెనా.. ఒమిక్రాన్
భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 406 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,43,45,945 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,04,781 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 383,36,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,81,606 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,44,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
ఒమిక్రాన్ కేసులు....
కాగా ఒమిక్రాన్ కేసులు కూడా భారత్ లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,431 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 454 కేసులు నమోదయ్యాయి.
Next Story