Mon Dec 23 2024 02:55:36 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్టు.. జీఎస్టీ. అదరహో
ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు మోత మోగించాయి. గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో జీఎస్టీ వసూలయింది
ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు మోత మోగించాయి. గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో జీఎస్టీ వసూలయింది. ఒక్క నెలలోనే 1,43,612 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 28 శాతం వృద్ధి రేటు కనిపించిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. గత నెలకంటే ఎక్కువగానే జీఎస్టీ వసూలయింది. గత నెల జులై కంటే ఆగస్టు నెలలో నాలుగు శాతం వృద్ధి కనిపించిందని అధికారులు వెల్లడించారు.
రికార్డు స్థాయిలో...
గత ఏడాది జీఎస్టీ కింద 1,12,020 కోట్ల రూపాయలుకాగా, ఈ ఏడాది మరో ముప్పయివేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభించింది. ఆగస్టు నెలలో వసూలైన జీఎస్టీలో 24,710 కోట్లు సీజీఎస్టీ కింద వసూలయిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఎస్జీఎస్టీ రూపంలో 10,168 కోట్లు వసూలయ్యాయని, గత ఏడాది మొదటి ఐదు నెలలతో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం అధికంగా జీఎస్టీ వసూలయింది.
Next Story