Mon Dec 23 2024 13:01:34 GMT+0000 (Coordinated Universal Time)
ఆధార్ చూపిస్తేనే పెళ్లిభోజనం.. ఇదేం అవమానం ?
పిలవని వారు కూడా భోజనాల కోసం వచ్చి ఉంటారని అనుమానించింది. దాంతో పెళ్లికి వచ్చిన అతిథులంతా భోజనం..
పిలవని పేరంటానికి భోజనాల కోసం వెళ్లే దృశ్యాలు సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలోనూ యువత ఇలాంటి ఆకతాయి పనులు చేస్తుంటుంది. కానీ.. ఆ ఫంక్షన్ చేసే వారు ఏర్పాటు చేసిన భోజనాలు వచ్చినవారందరికీ సరిపోకపోతే ఏం చేయాలి ? సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది ఓ కుటుంబానికి. ఒకేరోజు అక్క-చెల్లి పెళ్లిళ్లు చేశారు. ఈ పెళ్లిళ్లకు బంధుమిత్రులను, తెలిసిన వారిని ఆహ్వానించారు. కానీ.. ఆ పెళ్లిళ్లకు తండోపతండాలుగా అతిథులు వచ్చారు. అంతమందిని చూసి ఆ కుటుంబం ఖంగుతింది.
పిలవని వారు కూడా భోజనాల కోసం వచ్చి ఉంటారని అనుమానించింది. దాంతో పెళ్లికి వచ్చిన అతిథులంతా భోజనం చేయాలంటే తమ ఆధార్ కార్డులను చూపించాలని, అప్పుడే భోజనం ప్లేటు ఇస్తామని చెప్పింది. దాంతో అతిథులు హతాశులయ్యారు. ఆధార్ కార్డులున్నవారు వాటిని చూపించి భోజనం చేయగా.. లేనివారు ఇదేం అవమానం అని తిట్టుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆమ్రోహా జిల్లాలోని హసన్ పూర్ లో జరిగింది.
Next Story