Fri Dec 20 2024 19:49:55 GMT+0000 (Coordinated Universal Time)
130 కి పెరిగిన మరణాలు.. ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోలేదట
గుజరాత్ వంతెన విషాదం: గుజరాత్ వంతెన కూలిపోవడంలో మృతుల సంఖ్య 130కి చేరుకుంది, ఇప్పటివరకు 177 మంది రక్షించారు. మోర్బీ ప్రాంతంలో మచ్చునదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో.. నదిలో 400 మందికి పైగా గల్లంతయ్యారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి ఉన్నట్టుండి కూలిపోవడంతో.. దానిపై ప్రయాణిస్తున్న వారంతా అమాంతం నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పౌర, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డిఆర్ఎఫ్)కు చెందిన ఐదు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో రెస్క్యూ పనికొనసాగుతూనే ఉంది. ఘటనా స్థలంలో వైద్య బృందం కూడా ఉంది. వెలుతురు లేకపోవడంతో పనులకు ఆటంకం కలిగిందని అధికారులు చెప్పారు. మోర్బిలోని కేబుల్ వంతెన దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.. పునర్నిర్మాణం కోసం ఏడు నెలల పాటు మూసివేయబడింది. గుజరాతీల నూతన సంవత్సరమైన అక్టోబర్ 26న ప్రజల కోసం తిరిగి తెరవబడింది. వంతెనను చేరుకోవడానికి ₹ 17 టిక్కెట్ ఉంటుంది. ప్రభుత్వ టెండర్ ద్వారా వంతెనను పునరుద్ధరించిన ఒరెవా అనే ప్రైవేట్ ట్రస్ట్ తిరిగి తెరవడానికి ముందు అధికారుల నుండి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోలేదని మోర్బి మునిసిపల్ ఏజెన్సీ చీఫ్ సందీప్సిన్హ్ జాలా మీడియాకి తెలిపారు.
Next Story