Sun Dec 22 2024 21:03:21 GMT+0000 (Coordinated Universal Time)
తుపాకీ పట్టుకుని క్లాస్ లోకి వెళ్లి కూర్చున్నాడు.. తీరిగ్గా పేపర్ చదువుతూ
ఆ వ్యక్తి నుంచి కొన్ని బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, అవి పెట్రోల్ బాంబులని తెలిసింది. ఆ వ్యక్తి..
పశ్చిమ బెంగాల్లోని మాల్డాలోని పాఠశాలలో తుపాకీ పట్టుకున్న వ్యక్తి పిల్లలను బందీలుగా చేసుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అతని ప్లాన్ విఫలమయ్యేలా చేశారు. ఈ ఘటన మాల్డాలోని ముచియా చంద్ కాలేజీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వ్యక్తి తుపాకీతో తరగతిలోకి ప్రవేశించి వార్తాపత్రిక చదవడం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పోలీసులకు సమాచారం అందించింది, ఆ తర్వాత ఒక బృందం వచ్చి ఆ వ్యక్తిని పట్టుకున్నారు.
ఆ వ్యక్తి నుంచి కొన్ని బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, అవి పెట్రోల్ బాంబులని తెలిసింది. ఆ వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నాడని అధికారులు గుర్తించారు. విచారణలో అతడి భార్య తన కొడుకును దూరం చేసిందని పోలీసులకు చెప్పాడు. ఆ విషయంలో పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా ఎలాంటి సహాయం లభించలేదని వాపోయాడు. మాల్దా పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, "స్కూల్లోకి ఎవరో ప్రవేశించినట్లు మాకు సమాచారం వచ్చింది. అతని దగ్గర మారణాయుధాలు ఉన్నాయని మాకు తెలిసింది. మేము అతనితో చర్చలు జరిపి ఎటువంటి దారుణ ఘటన జరగకుండా చేసాము. అతని భార్యతో కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిసింది" అని చెప్పారు.
Next Story