Mon Dec 23 2024 15:50:58 GMT+0000 (Coordinated Universal Time)
H3N2 ఎఫెక్ట్.. స్కూళ్లు మూసివేత
H3N2 వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా విద్యాసంస్థల్ని మూసివేయాలని తీర్మానించింది. మార్చి 16 నుంచి 26 వరకు పుదుచ్చేరిలోని..
H3N2 ఇన్ ఫ్లుయెంజా వైరస్ యావత్ దేశాన్నీ వణికిస్తోంది. దీనికి తోడు కరోనా కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో H3N2 ప్రభావం పెరుగుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మార్చి 11వ తేదీ వరకూ అక్కడ 79 H3N2 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపై చర్చించింది.
H3N2 వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా విద్యాసంస్థల్ని మూసివేయాలని తీర్మానించింది. మార్చి 16 నుంచి 26 వరకు పుదుచ్చేరిలోని అన్ని పాఠశాలల్నీ మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. H3N2 కేసులను అరికట్టేందుకే స్కూళ్లను మూసివేస్తున్నట్లు అక్కడి విద్యాశాఖ మంత్రి ఎ.నమశివాయం తెలిపారు. కాగా.. H3N2 కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
H3N2 పేషెంట్లకు చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులను కేటాయిస్తోంది. ఎన్నికేసులున్నా.. వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా పాటించాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా.. దేశంలో ఇప్పటివరకూ H3N2 బారిన పడి ముగ్గురు మరణించారు. హర్యానా, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు మరణించారు.
Next Story