Mon Dec 23 2024 17:53:06 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చిన హార్దిక్
గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పటీదార్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ ఊహించని షాకిచ్చారు. ఆ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పటీదార్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ ఊహించని షాకిచ్చారు. ఆ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అందుకు సంబంధించి ట్విట్టర్లో ఓ లేఖ పోస్ట్ చేశారు. "ఈ రోజు నేను పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసాను. నా నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలందరూ స్వాగతిస్తారని నేను ఆశిస్తున్నాను. భవిష్యత్తులో గుజరాత్ కోసం నేను పని చేయగలనని బలంగా నమ్ముతున్నాను." అని ట్విట్టర్ లో హార్దిక్ తెలిపారు.
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ యూనిట్లో విభేదాలను పరిష్కరించడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హార్దిక్ పటేల్‌ను సంప్రదించినట్లు వర్గాలు తెలిపాయి. పార్టీలో కొనసాగాలని రాహుల్ గాంధీ స్వయంగా హార్దిక్ పటేల్‌కు సందేశం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విభేదాలను పరిష్కరించడానికి పార్టీ ఇన్ఛార్జ్లు, ఇతర నాయకులను కూడా హార్దిక్ పటేల్ ను సంప్రదించాలని రాహుల్ గాంధీ కోరారు. అయినా కూడా విభేదాల పరిష్కారం జరగకపోవడంతో హార్దిక్ కాంగ్రెస్ పార్టీని వీడాడు.
ఆర్టికల్ 370ని రద్దు, రామమందిర నిర్మాణం విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన పటేల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీతో గానీ, ప్రియాంక గాంధీతో గానీ తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే రాష్ట్ర నాయకత్వంపై తనకు అసంతృప్తి ఉందని గతంలోనే స్పష్టం చేశారు. ఈ నెల 15న హార్దిక్ పటేల్ ఇతర పటీదార్ నేతలు అల్పేశ్ ఖతిరియా, దినేశ్ బాంభానియాతో కలిసి బీజేపీ నేత, గుజరాత్ మంత్రి నరేశ్ పటేల్‌ను కలిశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీని వీడడం ఊహించని ఎదురుదెబ్బ.
Next Story