Sun Dec 22 2024 09:59:12 GMT+0000 (Coordinated Universal Time)
హర్యానాలో నువ్వా? నేనా?.. రౌండ్ .. రౌండ్ కు మారుతున్న?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతుండటంతో ఎవరిది అధికారమో చెప్పడం కష్టంగా మారింది. ప్రస్తుతం 41 స్థానాల్లో బీజేపీ, 40 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా తాజాగా బీజేపీ లీడ్ లోకి వచ్చింది.
హోరా హోరీగా...
దీంతో ఇక్కడ హోరా హోరీ పోరు కొనసాగే అవకాశముంది. ఇరు పార్టీల నేతలు గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఆరు నుంచి ఏడు రౌండ్లు మాత్రమే ఎన్నికల కౌంటింగ్ జరిగిందని, ఇంకా చాలా ఉందని చెబుతున్నారు. కానీ ఎవరిది గెలుపు అన్నది మాత్రం చెప్పడం హర్యానాలో కష్టంగా మారింది.
Next Story