Tue Nov 05 2024 14:54:41 GMT+0000 (Coordinated Universal Time)
Zika Virus : జికా వైరస్ ముప్పు... అలర్టయిన వైద్యశాఖ
మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది
దేశంలో జికా వైరస్ కలకలం రేపుతుంది. తాజాగా మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. మహారాష్ట్రలోని పూనేలో ఆరు ఇన్ఫెక్షన్ కేసులు నమోదయినట్లు వైద్యులు తెలిపారు. పూనేలోని ఎరండ్వానే ప్రాంతానికి చెందిన గర్భిణికి జికా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమెతో మరో గర్భిణికి కూడా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో వెల్లడి కావడంతో అందరినీ అలెర్ట్ చేశారు.
దోమల కారణంగానే...
జికా వైరస్ దోమల కారణంగానే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 47 మహిళ, 22 ఏళ్ల మహిళకు జికా వైరస్ సోకడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దోమల బెడద లేకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ సోకిన ఇద్దరు మహిళల ఆరోగ్య పరిస్థిితి నిలకడగా ఉందని చెబుతున్నారు. గర్భిణులు ఈ వైరస్ బారిన పడితే పుట్టే బిడ్డపై ప్రభావం చూపుతుందంటున్నారు. అందుకే దోమల బారిన పడకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముంబయి కార్పొరేషన్ అధికారులు సూచిస్తున్నారు.
Next Story