Mon Dec 23 2024 09:37:48 GMT+0000 (Coordinated Universal Time)
అక్టోబర్ 18 వరకూ వర్షాలే.. ఎక్కడెక్కడంటే..?
భారత వాతావరణ శాఖ (IMD) వచ్చే మూడు రోజులకు సంబంధించి వాతావరణ సూచనలను విడుదల చేసింది. తాజా బులిటెన్ ప్రకారం రాబోయే మూడు రోజులలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కారణంగా మధ్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవనున్నాయి. అక్టోబరు 18 వరకు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, మాహేలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దేశంలోని పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్టోబరు 18 వరకు భారీ వర్షంతో కూడిన వర్షపాతం నమోదుకానుంది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే ప్రాంతాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, మాహేలో వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 18న చాలా విస్తృతంగా తేలికపాటి నుండి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లక్షద్వీప్ మీదుగా మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 17న అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబరు 16న ఉత్తర అంతర్భాగమైన కర్ణాటకలో చాలా విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం, కొన్నిచోట్ల బలమైన వర్షాలు-ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది.
Next Story