Mon Dec 15 2025 06:46:32 GMT+0000 (Coordinated Universal Time)
Himachal Pradesh : భారీ వర్షాలు.. ఊరు కనపడకుండా పోయిందే
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక ఊరు మొత్తంకొట్టుకు పోయింది. సమేజ్ గ్రామం కనిపించ కుండా పోయింది. అర్థరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఊరు మొత్తం కొట్టుకుపోయింది.
ఒక్క ఇల్లు మాత్రం....
ఊరంతా పోయినా ఒకే ఒక ఇల్లు మాత్రం మిగిలింది. సమేజ్ గ్రామంలోని అనితా దేవికి చెందిన ఇల్లు మాత్రమే వరదల్లో కొట్టుకుపోకుండా మిగిలిపోయింది. వరద తాకిడికి ఈ గ్రామంలోని ప్రజలు భయపడి దగ్గరలోని కాళీమాత ఆలయం వద్ద తలదాచుకున్నామని, అదే తమను రక్షించిందని అనితా దేవి తెలిపారు. ఊరంతా కొట్టుకుపోవడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు.
Next Story

