Mon Dec 23 2024 13:48:18 GMT+0000 (Coordinated Universal Time)
కేదార్నాధ్ లో తెలుగుయాత్రికులు.. పన్నెండు మందిని రక్షించిన సిబ్బంది
కేదార్నాధ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాత్రికులు అనేక మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ రక్షించారు.
కేదార్నాధ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాత్రికులు అనేక మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ రక్షించారు. దాదాపు పదివేల మంది యాత్రికులను కాపాడినట్లు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో కేదార్నాధ్ యాత్రను నిలిపి వేశారు.
ఉత్తరకాశీకి తరలించి....
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 15మంది యాత్రికులు కేదార్నాధ్ లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, వారిని తరలించాలని రుద్రప్రయాగ్ కలెక్టర్ కు సూచించారు. దీంతో అధికారులు హెలికాప్టర్ ద్వారా 12మందిని ఉత్తర కాశీకి తరలించారు. మరో ముగ్గురు ఇంకా కేదార్నాధ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story