Mon Dec 15 2025 04:03:40 GMT+0000 (Coordinated Universal Time)
ఈశాన్యంలో భారీ వర్షాలు.. ముగ్గురు మృతి
ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి.

ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రధానంగా ఉత్తర్ప్రదేశ్ లోని గంగానది అనేక ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమయింది.
భవనాలు కూలి...
మరోవైపు డెహ్రాడూన్ లో వర్షాలకు తడిసి భవనాలు కూలిపోతున్నాయి. ఒక భవనం కూలి పోవడంతో ముగ్గురు మరణించారు. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. శిధిల భవనాలను గుర్తించి వాటిని ఖాళీ చేయించే పనిలో అధికారులు ఉన్నారు.
Next Story

