Sun Nov 24 2024 23:10:40 GMT+0000 (Coordinated Universal Time)
ముంబయిని ముంచెత్తుతున్న వానలు
ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి నుంచి ధాటిగా కురిసిన వర్షానికి ముంబయిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి
ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ధాటిగా కురిసిన వర్షానికి ముంబయిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబయిలో ఆఫీసుకు వెళ్లాల్సిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. రహదారిపై నడుము లోతు నీరు ప్రవహిస్తుంది. సియోన్ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది.
పాత భవనాలపై...
నవీ ముంబయిలోని ఖండేశ్వర్ రైల్వే స్టేషన్ లోకి నీళ్లు చేరాయి. అనేక చోట్ల బస్సులు మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ముంబయి వాసులు వణికిపోతున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాత భవనాలపై ముంబయి కార్పొరేషన్ అధికారులు ఫోకస్ పెట్టారు.
Next Story