Tue Dec 24 2024 00:23:50 GMT+0000 (Coordinated Universal Time)
బురదలో చిక్కుకున్న మోదీ హెలికాప్టర్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బురదలో కూరుకుపోయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది
ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బురదలో కూరుకుపోయింది. ల్యాండ్ అయిన సమయంలో బురదలో కూరుకుపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధాని భద్రతపై ఆయన సెక్యూరిటీ సీరియస్ అయినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అనేక ప్రాంతాలకు ఆయనకు హెలికాప్టర్లోనే ప్రయాణిస్తూ సభలు, రోడ్‌షోలలో పాల్గొంటున్నారు.
విచారణ ప్రారంభం...
ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం కర్ణాటకలో ఒకచోట హెలికాప్టర్ ల్యాండ్ అయి బురదలో కూరుకుపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే ప్రధాని వెంటనే హెలికాప్టర్ దిగి ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. జరిగిన సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ప్రధాని హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఎందుకు తనిఖీ చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై విచారణ ప్రారంభమయింది.
Next Story