Sun Dec 22 2024 03:58:36 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో రావణదహనానికి ప్రభాస్
ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఈరోజు జరిగే రావణదహనం కార్యక్రమానికి హీరో ప్రభాస్ హాజరుకానున్నారు.
ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఈరోజు జరిగే రావణదహనం కార్యక్రమానికి హీరో ప్రభాస్ హాజరుకానున్నారు. రామ్ లీలా మైదానంలో నేడు రావణదహనం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ ప్రభాస్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాలను జరపడం లేదు. అయితే ఈసారి కరోనా కేసులు తగ్గడంతో రామ్లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమాన్ని భారీగా చేయాలని కమిటీ నిర్ణయించింది.
కమిటీ ఆహ్వానం మేరకు...
రావహన దహన కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హీరో ప్రభాస్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు హాజరు కానున్నారని కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండటంతో ఆయనకు కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. లక్షలాది మంది ఈ రావణ దహనం కార్యక్రమాన్ని వీక్షించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో ఉన్న ప్రభాస్ ఢిల్లీ చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Next Story