Sun Dec 22 2024 13:47:05 GMT+0000 (Coordinated Universal Time)
మందుబాబులకు షాక్
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు షాక్ ఇస్తూ ధరలను పెంచింది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు షాక్ ఇస్తూ ధరలను పెంచింది. బాటిల్ పై పది రూపాయల సెస్సును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదాయం పెరగనుంది. ఏడాదికి వంద కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం లభించనుంది. అయితే పాలఉత్పత్తి దారుల ఆదాయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఈ ఏడాది బడ్జెట్ లో...
ఈ ఏడాది బడ్జెట్ లో మద్యం బాటిల్ పై పదిరూపాయల సెస్ ను విధించడంతో వంద కోట్ల ఆదాయం వస్తుందని, దానిని అధిక పాల ఉత్పత్తి సాధించేందుకు వినియోగిస్తామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ ుఖూ తెలిపారు. పర్యాటక ప్రదేశం కావడంతో టూరిస్టులు మద్యం కొనుగోలు చేస్తారని, తద్వారా అధిక ఆదాయం వస్తుందని సర్కార్ అంచనా వేస్తుంది.
Next Story