Mon Dec 23 2024 02:36:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హోలీ.. రంగుల భారతం
దేశ వ్యాప్తంగా నేడు హోలీ సంబరాలు జరగనున్నాయి. వసంత రుతువు వచ్చే వేళ హోలీ సంబరాలు జరుగుతాయి
దేశ వ్యాప్తంగా నేడు హోలీ సంబరాలు జరగనున్నాయి. వసంత రుతువు వచ్చే వేళ హోలీ సంబరాలు జరుగుతాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకున్నా రంగులు చల్లుకుంటూ హోలీ పండగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. కొత్త చిగురులు తొడిగే వేళ ఈ పండగను జరుపుకుంటారు. భారతీయ సంస్కృతిలో భాగమైన హోలీ పండగను దేశవ్యాప్తంగా పేద, ధనిక తేడా లేకుండా జరుపుకుంటారు.
దక్షిణాది రాష్ట్రాలలో.....
ధనికులుండే ప్రాంతాల్లో ఎలా జరుగుతుందో దానికి మించి పేదల బస్తీల్లో ఈ పండగ జరుగుతుంది. ప్రతి ఇంట్లో రంగుల సంబరాలు జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఒక్కోరకంగా జరుపుకుంటారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకింత తక్కువయినా ఇటీవల కాలంలో ఈ సంప్రదాయం ఈ ప్రాంతాలకు కూడా వ్యాపించిందనే చెప్పాలి.
Next Story