Mon Nov 18 2024 06:36:38 GMT+0000 (Coordinated Universal Time)
రూ.2 వేల నోట్లను మార్చుకోండిలా.. దానికి నో లిమిట్
డిపాజిట్ కాకుండా నోట్లను మార్చుకోవాలనుకునేవారు దగ్గర్లో ఉన్న ఏదైనా బ్రాంచికి వెళ్లి రూ.2 వేల నోట్లు ఇచ్చి.. అందుకు తగిన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోటును చలామణి నుంచి తప్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తక్షణమే అన్ని బ్యాంకుల్లో రూ.2000 నోటు జారీని నిలిపివేయాలని ఆదేశాలు పంపింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రజలు తమవద్దనున్న రూ.2000 నోట్లను మే 23వ తేదీ నుంచి సెప్టెంబరు 30,2023 వరకూ రోజుకి 10 నోట్లను బ్యాంకులలో మార్చుకుని చిల్లర తీసుకోవచ్చని తెలిపింది. అలాగే..డిపాజిట్ కూడా చేసుకోవచ్చని, అందుకు ఎలాంటి పరిమితి లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
డిపాజిట్ కాకుండా నోట్లను మార్చుకోవాలనుకునేవారు దగ్గర్లో ఉన్న ఏదైనా బ్రాంచికి వెళ్లి రూ.2 వేల నోట్లు ఇచ్చి.. అందుకు తగిన చిల్లర తీసుకోవచ్చు. బ్యాంకులు లేని చోట్ల బ్యాంకింగ్ సేవలందించే సంస్థలను సంప్రదించి రూ.2 వేల నోటును మార్చుకోవచ్చు. బ్యాంకులలో గానీ, బ్యాంకింగేతర సంస్థల్లో గానీ రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రజలు ఈ విషయాలను తెలుసుకుని తమవద్దనున్న నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేసుకోవాలని సూచించింది.
Next Story