Mon Dec 23 2024 05:34:27 GMT+0000 (Coordinated Universal Time)
ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా ? ఇలా చెక్ చేసుకోండి
దానిపై క్లిక్ చేసి.. మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల..
మరికొద్ది నెలల్లో ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మరి ఎన్నికల్లో మీకు నచ్చిన, మెచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కు ఉండటం ఎంతో ముఖ్యం. అది ఉంటేనే ఒక పౌరుడిగా మీ నాయకుడిని ఎన్నుకోగలరు. మరి ఓటర్ల జాబితాలో మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకున్నారా ? తెలుసుకోక పోతే ఇలా చెక్ చేసుకోండి.
https://ceoandhra.nic.in వెబ్ సైట్ లోకి వెళ్తే.. పై భాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. అసెంబ్లీ నియోజకవర్గాల విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్ లో ఉంటాయి. మీరు ఉంటున్న ఏరియా ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తుందో చూసుకుని, ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి అందులో మీ పేరు ఉందా? లేదా చూసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోనే సెర్చ్ యువర్ నేమ్ అనే సబ్ కేటగిరీ కూడా ఉంటుంది.
ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నంబర్ తో ఇలా సెర్చ్ చేయండి
https://voterportal.eci.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయగానే.. సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే కేటగిరీ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న సంఖ్యను ఎంటర్ చేయండి. అక్కడ జాబితాలో మీ పేరు ఉందా? లేదా? ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది ? సీరియల్ నంబర్ ఎంత వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నంబర్ తెలియకపోతే.. అడ్వాన్స్ సెర్చ్ విభాగంలోకి వెళ్లి మీపేరు, మీ తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను ఎంటర్ చేయడం ద్వారా కూడా ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
పేరు, వివరాలతో ద్వారా తెలుసుకోవడం
www.nvsp.in వెబ్ సైట్ లోకి వెళ్తే.. సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే కేటగిరీ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే.. సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే రెండు సబ్ కేటగిరీలు కనిపిస్తాయి. అక్కడ మీపేరు, మీ తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం తదితర వివరాలను ఎంటర్ చేసి లేదా ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను ఎంటర్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్ లో ఇలా సెర్చ్ చేయండి
గూగుల్ ప్లే స్టోర్ లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన Voter Helpline మొబైల్ యాప్ ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. యాప్ లోకి వెళ్లాక పైన సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరన్ రోల్ అనే విభాగం ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సెర్చ్ బై బార్ కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే నాలుగు విభాగాలు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండు విభాగాలకు సంబంధించి మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే మీ పేరు, మీ తండ్రిపేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలను పొందుపరచడం ద్వారా లేదా ఫోటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య ఎంటర్ చేయడం ద్వారా కూడా జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవచ్చు.
Next Story