Sun Dec 22 2024 18:19:47 GMT+0000 (Coordinated Universal Time)
చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్.. పది మంది మావోల మృతి
చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పదిమంది మావోయిస్టుల మృతి చెందారు.
చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పదిమంది మావోయిస్టుల మృతి చెందారు. ఘటన స్థలంలో భారీగా మారణాయుధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పులు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మావోయిస్టులు ఇక్కడ సమావేశం అయ్యారన్న సమాచారంతో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
పక్కా సమాచారంతో...
భద్రతా సిబ్బంది మావోయిస్టుల కోసం గాలిస్తుండగా వారు ఎదురుపడటంతో కాల్పులు ప్రారంభమయినట్లు చెబుతున్నారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్ ఘడ్ అడవుల్లోకి మావోయిస్టులు ప్రవేశించారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరపడంతో భద్రతాదళాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఇప్పటి వరకూ అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మృతి చెందిన మావోయిస్టులు ఎవరనేది పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Next Story