Sat Nov 23 2024 00:04:37 GMT+0000 (Coordinated Universal Time)
భారత్‌లో భారీగా కరోనా కేసులు
భారత్‌లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,824 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
భారత్‌లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,824 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరణాల సంఖ్య కూడా నమోదవుతుండటం భయాందోళనలకు గురి చేస్తుంది. కేరళ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
యాక్టివ్ కేసులు...
కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు18,389 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్‌లను విధిగా ధరించడం, శానిటైజర్ వాడకం వంటివి చేయాలంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు.
Next Story