Thu Dec 26 2024 14:14:39 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 3,016 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 3,016 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. పథ్నాలుగు మంది కరోనా కారణంగా మరణించారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఖచ్చితంగా ట్రేసింగ్, టెస్టింగ్, వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం దేశంలో 15,208 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమయింది. అలాగే కేరళలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని కోరుతుంది. లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది.
Next Story