Sun Dec 22 2024 11:49:47 GMT+0000 (Coordinated Universal Time)
భర్తను అలా పిలిచినందుకు విడాకులు మంజూరు చేసిన న్యాయస్థానం
భార్య పదే పదే భర్త శరీరం రంగు గురించి మాట్లాడుతుండటంతో పాటు తూలనాడే విధంగా వ్యవహరించడంతో ఆ భర్త కోర్టును ఆశ్రయించారు
భార్య పదే పదే భర్త శరీరం రంగు గురించి మాట్లాడుతుండటంతో పాటు తూలనాడే విధంగా వ్యవహరించడంతో ఆ భర్త కోర్టును ఆశ్రయించారు. తనను కర్రోడా అని అనడంతో భర్త కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రతి సారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని న్యాయస్థానానికి తెలుపుకున్నాడు. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
క్రూరత్వం కిందకు...
ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కేరళ న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పద్దతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్గా కూడా ఎఫెక్ట్ పడుతుందని పేర్కొంది. భర్తకు మానసిక వేదన కలిగించిన భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.
Next Story