Sat Mar 01 2025 23:39:31 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ - బెంగళూరు హైవే పై ఇక బ్రేకుల్లేవ్
హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి ఇక సూపర్ హైవేగా మారనుంది

హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి ఇక సూపర్ హైవేగా మారనుంది. దాదాపు 576 కిలోమీటర్ల ఉన్న రహదారిని సూపర్ హైవేగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలకు విస్తరించి ఉన్న ఈ రహదారి రూపు రేఖలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సమాచారాన్ని...
ఈ హైవేను సూపర్ ఇన్ఫర్మేషన్ హైవేగా తీర్చిదిద్దనున్నారు. ఎక్కడికక్కడ సమాచారాన్ని అందించే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. పెట్రోలు బంకులు, ఆసపత్రులు మీరు ఉన్న హైవే ప్రాంతానికి ఎంతదూరంలో ఉన్నాయన్న సమాచారాన్ని ప్రదర్శించనున్నారు. ఢిల్లీ - ముంబయి ఎక్స్ ప్రెస్ హైవే లో ఈ తరహా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తయిన తర్వాత బెంగళూరు - హైదరాబాద్ హైవేను సూపర్ హైవేగా మార్చనున్నారు. సమాచారం మొత్తం డిజిటల్ బోర్డుల ద్వారా ప్రదర్శించనున్నారు.
Next Story