Mon Dec 23 2024 17:59:19 GMT+0000 (Coordinated Universal Time)
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఫుడ్స్ లో నెం.1 ప్లేస్ లో హైదరాబాదీ హలీం
పదేళ్ల వరకూ హైదరాబాదీ హలీం కు జీఐ హోదా కొనసాగుతుంది. తొలిసారిగా హైదరాబాదీ హలీం కి జీఐ హోదా వచ్చింది. రంజాన్ మాసంలో..
హైదరాబాదీ హలీంకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. రసగుల్లా, బికనేరి భుజియా, రత్లామి సేవ్ వంటి భౌగోళిక గుర్తింపు (జీఐ-జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఉన్న 17 ఆహార పదార్థాల్లో హైదరాబాదీ హలీం అత్యంత ప్రసిద్ధి చెందిన జీఐ గా.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నుంచి అవార్డు గెలుచుకుంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాన్ని ప్రచారం చేయడానికి కేంద్రం ఈ ఓటింగ్ నిర్వహించింది. ఇందులో భారత్ తో పాటు విదేశీ ఆహార ప్రియులు కూడా ఆగస్టు 2 నుంచి అక్టోబర్ 9 వరకూ పాల్గొన్నారు.
పదేళ్ల వరకూ హైదరాబాదీ హలీం కు జీఐ హోదా కొనసాగుతుంది. తొలిసారిగా హైదరాబాదీ హలీం కి జీఐ హోదా వచ్చింది. రంజాన్ మాసంలో మాంసం, పప్పు ధాన్యాలు, గోధుమ, సుగంధ ద్రవ్యాలతో హలీం చేస్తారు. హైదరాబాదీ హలీంకి భారత్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఓట్లు భారీగా వచ్చాయని జీఐ అటార్నీ ఎస్.రవి అన్నారు. హైదరాబాదీ హలీంకు వచ్చిన ఈ అవార్డును హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ మజీద్ కు న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఇటీవలే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రదానం చేశారని చెప్పారు.
Next Story