Mon Nov 18 2024 11:47:49 GMT+0000 (Coordinated Universal Time)
MamataBanerjee: ముఖ్యమంత్రి పదవి వద్దు.. రాజీనామాకు సిద్ధం
సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావాలని
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసనలకు దిగిన డాక్టర్ల తో సమావేశం కోసం కొన్ని గంటల పాటూ వేచి చూశారు. అయితే లైవ్ టెలీకాస్ట్ చేస్తే తప్ప చర్చలకు రాలేమని భీష్మించుకు కూర్చున్నారు వైద్యులు. చర్చలు రికార్డు కావాలంటే చేస్తాము కానీ, లైవ్ టెలీకాస్ట్ మాత్రం కుదరదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో వైద్యులు ముఖ్యమంత్రితో సమావేశానికి హాజరవ్వలేదు.
సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావాలని మమతా బెనర్జీ వైద్యులను ఆహ్వానించారు. గంటన్నర తర్వాత 32 మంది వైద్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే 15 మంది ఎక్కువగా వచ్చారు. అయితే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో వారు హాలులోకి ప్రవేశించడానికి నిరాకరించారు. ఇక సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు తాను రెండు గంటలకు పైగా వేచి ఉన్నానని, ఇంతకుముందు రెండు ఆహ్వానాలను తిరస్కరించారన్నారు. వారు వస్తారని నేను రెండు రోజులు వేచి ఉన్నాను. కానీ రాలేదు. మేము వారి సెంటిమెంట్ను గౌరవిస్తాము, వారిని క్షమించామని మమతా బెనర్జీ వెల్లడించారు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు.. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. హత్యకు గురైన వైద్యురాలికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానన్నారు.
Next Story