Mon Dec 23 2024 15:32:19 GMT+0000 (Coordinated Universal Time)
ఎంతో కష్టపడి భార్యను చదివించాడు.. ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది.. కానీ
తాను చేస్తున్నది చిన్న ఉద్యోగమే అయినా.. భార్యను ఆమె కలలు సాకారం చేసుకునే దిశగా ప్రోత్సహించాడు. ఆమె కల ప్రభుత్వ ఉద్యోగం..
పెళ్లైన మహిళ తన కలలను సాకారం చేసుకుంటూ ముందుకు సాగితే.. ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఉంటాడు అనేది నానుడి. అలాగే ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందన్న సామెత కూడా ఉంది. ఇప్పుడీ సామెతలు ఎందుకు ? అనే కదూ మీ ప్రశ్న. ఇవి చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆడపిల్లల జీవితం పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత అంతా అత్తింటి వారికి, భర్తకు నచ్చినట్లు జీవించాల్సి ఉంటుంది. కొందరు భర్తలు మాత్రమే.. భార్యను అర్థం చేసుకుని, వారి లక్ష్యాలను సాధించేందుకు ప్రోత్సహిస్తారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన అతుల్ కుమార్ మౌర్య్ కూడా అలానే భార్యను సపోర్ట్ చేశాడు.
తాను చేస్తున్నది చిన్న ఉద్యోగమే అయినా.. భార్యను ఆమె కలలు సాకారం చేసుకునే దిశగా ప్రోత్సహించాడు. ఆమె కల ప్రభుత్వ ఉద్యోగం. అందుకు అతుల్ కుమార్ తనకు వీలైనంత సహాయం చేశాడు. భార్యను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి చదివించాడు. ఆమె కల నెరవేరింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా ఉద్యోగం పొందింది. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక తన అసలు రంగును బయటపెట్టింది ఆ భార్య. తన భార్యకు గొప్ప ఉద్యోగం వచ్చిందని సంతోషించేలోపు ఆమె ఆ భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దాంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు.
ఇటీవలే అతుల్ జైలు నుంచి విడుదలయ్యాడు. తన భార్య తనను మోసం చేసిందని, చెబితే ఎవరూ సపోర్ట్ చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. జైలుకెళ్లి బయటకు వచ్చిన అతుల్ కు ఉద్యోగం కూడా పోయింది. పైగా తన భార్య తనకు విడాకుల నోటీసు పంపిందని, విడాకులివ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారని వాపోయాడు. తన భార్యే సర్వస్వంగా బతికిన తనను ఇంత మోసం చేస్తుందని ఊహించలేకపోయానంటూ అతుల్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆమెకు ఉద్యోగం రాకముందుకు వరకూ ఎంతో సంతోషంగా జీవించామన్నాడు. ఇప్పుడు ఆమె తన పై ఆఫీసర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇద్దరూ కలిసి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. ఈ వ్యవహారం ఎంతవరకూ దారితీస్తుందో చూడాలి. ఈ భర్త గోడు విన్న నెటిజన్లు.. అతనికి పట్ల సానుభూతి చూపుతూ.. కామెంట్స్ చేస్తున్నారు.
Next Story