Mon Dec 23 2024 16:11:19 GMT+0000 (Coordinated Universal Time)
మూత్రవిసర్జన కేసు బాధితుడిని నేను కాదు : షాకిచ్చిన వ్యక్తి
ఆ వీడియో మూడు నెలల క్రితంది అయినా.. తప్పు తప్పేనంటూ నిందితుడు ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేసి, అతని ఇంటిని కూడా..
ఇటీవల మధ్యప్రదేశ్ సిధీ జిల్లాలో గిరిజనుడిపై మూత్రవిసర్జన చేసిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ వీడియో మూడు నెలల క్రితంది అయినా.. తప్పు తప్పేనంటూ నిందితుడు ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేసి, అతని ఇంటిని కూడా కూల్చేశారు. ఆ తర్వాత బాధితుడైన వ్యక్తిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఇంటికి పిలిపించి, కాళ్లు కడిగి క్షమాపణలు కోరారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే.. ఇప్పుడు సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి మూత్ర విసర్జన కేసులో అసలు బాధితుడిని తానుకాదని షాకిచ్చాడు.
నిందితుడు ప్రవేశ్ శుక్లా తనతో బలవంతంగా సంతకం చేయించారని దశమత్ రావత్ పేర్కొనడం గమనార్హం. దాంతో అసలైన మూత్ర విసర్జన బాధితుడు ఎవరు ? ఎందుకు అతడిని దాస్తున్నారు ? అన్న చర్చ మొదలైంది. అసలైన బాధితుడిని వదిలేసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ .. ఎవరి కాళ్లో కడిగి డ్రామాలాడారంటూ కాంగ్రెస్ విమర్శించింది. నిందితుడైన ప్రవేశ్ శుక్లా ప్రస్తుతం రేవా సెంట్రల్ జైల్లో ఉన్నాడు.
Next Story