Mon Dec 23 2024 17:40:53 GMT+0000 (Coordinated Universal Time)
Idol Of God: 100 సంవత్సరాల నాటి విగ్రహాన్ని దొంగిలించాడు.. ఎందుకు తిరిగి ఇచ్చాడంటే?
దేవాలయం నుండి 100 సంవత్సరాల నాటి విగ్రహాన్ని దొంగతనం చేసిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని దేవాలయం నుండి 100 సంవత్సరాల నాటి విగ్రహాన్ని దొంగతనం చేసిన వ్యక్తి చివరికి దాన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఏ భయం పట్టుకుందో ఏమో కానీ.. అష్టధాతువు విగ్రహాన్ని దొంగిలించిన కొన్ని రోజుల తరువాత ఇచ్చేశాడు. దొంగతనం చేశాక అతడికి ఏదేదో అయిపోయిందని కూడా తెలిపాడు. తాను ఎలాంటి పరిస్థితులను అనుభవించాడో కూడా వివరిస్తూ క్షమాపణలతో కూడిన లేఖను కూడా విడిచిపెట్టాడు.
దొంగతనం చేసిన తర్వాత అనుకోని అనుభవాలు తనకు ఎదురయ్యాయనని, అపరాధ భావనతో మునిగిపోయానని ఆ దొంగ వివరించినట్లుగా పోలీసులు తెలిపారు. చివరికి ఆ దొంగ దొంగిలించిన విగ్రహాన్ని హైవే పక్కన వదిలివేసాడు. దానితో పాటు దానిని దొంగిలించినందుకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెబుతూ లేఖను కూడా ఉంచాడు.
సెప్టెంబర్ 23న ప్రయాగ్రాజ్లోని నవాబ్గంజ్లోని రామ్ జానకి ఆలయంలో 100 ఏళ్ల నాటి అష్టధాతువు విగ్రహం చోరీకి గురైంది.ఈ ఘటనపై ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ పూజారి దొంగతనంతో తీవ్ర మనస్తాపానికి గురై నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాడు. దొంగతనం జరిగిన సరిగ్గా 10 రోజుల తర్వాత, గౌఘాట్ లింక్ రోడ్డులో గోనె సంచిలో విగ్రహాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రజలు దానిని గౌఘట్ ఖల్సా ఆశ్రమానికి తీసుకెళ్లారు. గోనె సంచిని తెరవగా, విగ్రహంతో పాటు లేఖ కూడా కనిపించింది. విగ్రహాన్ని దొంగిలించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ గురించి, అతని గుర్తింపు లేదా అతని ఆచూకీ గురించి ఇంకా సమాచారం లభించలేదు.

Next Story