Mon Dec 23 2024 14:53:44 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలో భయానక వాతావరణం.. మోదీకి విద్యార్థుల లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి బెంగళూరు, అహ్మదాబాద్ కు చెందిన ఐఐఎం విద్యార్థులు లేఖ రాశారు
ప్రధాని నరేంద్ర మోదీకి బెంగళూరు, అహ్మదాబాద్ కు చెందిన ఐఐఎం విద్యార్థులు లేఖ రాశారు. దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆందోళన చెందారు. జరుగుతున్న ఘటనలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని విభజించే శక్తులు పేట్రేగిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మౌనం దేశ విద్రోహశక్తులకు మరింత ఊతమిచ్చే విధంగా ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ప్రార్థనాలయాలు.....
చర్చిలు, ప్రార్థనాలయాలు ధ్వంసమవుతున్నాయన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టాలని కొందరు పిలుపునిస్తుండటం ఆందోళన కల్గిస్తుందని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. కొందరు చట్టం పట్ల భయం లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇటీవల హరిద్వార్ లో కొందరు ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కూడా వారు ఉదహరించారు. పేట్రేగిపోతున్న శక్తులకు భయం లేకపోవడానికి కారణం మోదీ మౌనమేనంటూ వారు లేఖలో పేర్కొనడం విశేషం.
Next Story