Mon Dec 23 2024 09:52:58 GMT+0000 (Coordinated Universal Time)
వణికిస్తోన్న భారీవర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ, స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు తిరువల్లూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. వారంరోజులు
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తోన్న కుండపోత వానలు.. లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సముద్రంలో అలల ఉధృతి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు తిరువల్లూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. వారంరోజులుగా కురుస్తున్న వానలతో.. చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఆ జిల్లాల్లో 30 ఏళ్లలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నవంబర్ 13 తేదీ వరకూ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Next Story