Mon Dec 23 2024 18:50:43 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ సైక్లోన్ పుకారు మాత్రమే : ఐఎండీ
ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహాపాత్ర తుపాను పుకార్లపై స్పందించారు. బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడుతుందని..
బంగాళాఖాతంలో ఈనెల 20న అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమేపీ బలపడి పెను తుపానుగా మారనుందంటూ..నిన్న వార్తా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) స్పందించింది. సూపర్ సైక్లోన్ వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అది ఉట్టి పుకారు మాత్రమేనని ఐఎండీ స్పష్టం చేసింది. ఆ తుపానుకు 'సిత్రాంగ్' అని నామకరణం చేసినట్టు వస్తున్న వార్తల్లోనూ నిజంలేదని పేర్కొంది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహాపాత్ర తుపాను పుకార్లపై స్పందించారు. బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడుతుందని, అది భారత తీరాన్ని తాకుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సూపర్ సైక్లోన్ పై తాము ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. కెనడాలోని సస్కాచెవాన్ యూనివర్సిటీలో వాతావరణ శాస్త్రంలో పీహెచ్ డీ చేస్తున్న ఓ విద్యార్థి బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడనుందన్న అంచనాలు వెలువరించినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగానే తుపానుపై పుకార్లు వచ్చినట్లు సమాచారం.
Next Story