Mon Dec 23 2024 10:36:16 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా తగ్గిన కరోనా కేసులు
24 గంటల్లో భారత్ లో 3,720 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్ లో 40,177 యాక్టివ్ కేసులున్నాయి
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇది కొంత ఊరట కలిగించే అంశమే. గడిచిన 24 గంటల్లో భారత్ లో 3,720 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కోవిడ్ నిబంధనలను...
ప్రజలు అప్రమత్తంగా ఉండటం, జాగ్రత్తలు పాటించడంతో పాటు అన్ని రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను అమలు చేయడంతో కొంత కేసుల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తే కరోనా కనుమరుగవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో 40,177 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
- Tags
- covid cases
- india
Next Story