Thu Dec 19 2024 18:30:23 GMT+0000 (Coordinated Universal Time)
Exit Polls : మూడు కాంగ్రెస్.. ఒకటి బీజేపీకి
ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తుంది.
ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం మూడింటిలో కాంగ్రెస్, ఒక రాష్ట్రంలో బీజేపీ, మరొకదానిలో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముందని తేల్చింది. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, రాజస్థాన్ లో బీజేపీ, మిజోరాంలో ఎన్ఎంఎఫ్ గెలుస్తుందని చెప్పాయి మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం మధ్యప్రదేవ్ లో కాంగ్రెస్ 117 నుంచి 139 స్థానాలు, బీజేపీ 91 నుంచి 113 స్థానాలు, ఇతరులు ఎనిమిది స్థానాల్లో గెలిచే అవకాశముందని తేల్చింది. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పింది. రిపబ్లిక్ టీవీ - మ్యాటేజీ సర్వే ప్రకారం బీజేపీ 118 నుంచి 130 స్థానాలు, కాంగ్రెస్ 97 నుంచి 107 స్థానాలు గెలుస్తారని తేల్చింది.
ఛత్తీస్గడ్ లో...
ఛత్తీస్ గడ్ లో దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ దే అధికారం అని తేల్చాయి. సీ ఓటరు సర్వే సంస్థ బీజేపీ 36 నుంచి 48 స్థానాలు, కాంగ్రెస్ 41 నుంచి 53 స్థానాల్లో గెలుస్తాయని చెప్పింది.ఇండియా టుడే యక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం బీజేపీ 36 నుంచి 46 స్థానాలు, కాంగ్రెస్ 40 నుంచి యాభై స్థానాలు గెలుస్తాయని తేల్చింది. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ బీజేపీ 34 నుంచి 45 స్థానాలు, కాంగ్రెస్ 42 నుంచి 53 స్థానాలు గెలుసతాయని చెప్పింది. రిపబ్లిక్ టీవీ బీజేపీ 35 నుంచి 45, కాంగ్రెస్ నలభై నాలుగు నుంచి 52 గెలుస్తాయి. ఛత్తీస్గడ్ లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. మిజోరాంలో అన్ని సంస్థలు ఎన్ఎంఎఫ్ గెలుస్తుందని చెప్పాయి.
Next Story