Sun Nov 17 2024 23:23:56 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం తాగి 22 మంది మృతి
గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 22 మంది మరణించారు.
గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 22 మంది మరణించారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గుజరాత్ లోని భావ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి ఆరోగ్య పరిస్థితి విషమించి దాదాపు యాభై మంది వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
పెరుగుతున్న కేసులు..
ధందుక, భావ్నగర్, బోటాడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కల్తీ మద్యం తాగిన వారితో నిండిపోయాయి. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఎంత మంది కల్తీ మద్యాన్ని సేవించి ఉంటారన్న ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు దీనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో మద్యం ఎలా వచ్చిందన్న దానిపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఇద్దరు ఎక్సైజ్ అధికారులను ప్రభుత్వం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసింది.
Next Story