Sun Dec 22 2024 11:59:08 GMT+0000 (Coordinated Universal Time)
జార్ఖండ్ లో రైల్వే ట్రాక్ పేల్చివేత
జార్ఖండ్ లో తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ ను పేల్చారు.
ఇటీవల కాలంలో కొందరు దుండగులు రైల్వే ట్రాక్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ట్రాక్ పై గ్యాస్ సిలిండర్లు పెట్టడం, రైలు పట్టాలు తొలగించడం వంటి చేస్తూ పెను ప్రమాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. జార్ఖండ్ లో తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ ను పేల్చారు. 39 కిలోమీటర్ల మేరకు రైల్వే ట్రాక్ విరిగి పడింది.
ముందుగా గుర్తించడంతో...
కానీ ముందుగా రైల్వే సిబ్బంది వీటిని గుర్తించడంతో అనేక సార్లు ఈ ప్రమాదం తప్పింది. ఉత్తర్ప్రదేశ్ లో, జార్ఖండ్ లో జరిగిన ఘటనల వెనక ఎవరు ఉన్నారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. పోలీసులు ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వకూ నిందితుల జాడ ఎవరూ అనేది తెలియడం లేదు.
Next Story