Sun Dec 22 2024 23:13:09 GMT+0000 (Coordinated Universal Time)
షిండే దే అసలైన శివసేన
మహారాష్ట్రలో స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసలైన శివసేన పార్టీ ఏక్నాథ్ షిండే వర్గానిదేనని చెప్పారు.
మహారాష్ట్రలో స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసలైన శివసేన పార్టీ ఏక్నాథ్ షిండే వర్గానిదేనని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ సర్వేకర్ ఉత్తర్వులు జారీ చేశారు. శివసేన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇరు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఈరోజు స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు.
అనర్హత వేటు....
షిండే వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉణ్నారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతే వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను స్పీకర్ తిరస్కరించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రే వర్గానికి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కొనసాగేందుకు మార్గం సుగమమయింది.
Next Story