Mon Dec 23 2024 07:47:29 GMT+0000 (Coordinated Universal Time)
మూగజీవికి చిత్రహింస.. కారుకు కుక్కను కట్టేసి 5.కిమీలు
రాజస్థాన్ లోని జోథ్పూర్ లో డాక్టర్ రజనీష్ టల్వా ఇంటి వద్ద ఉన్న వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు
రాజస్థాన్ లో ఒక వైద్యుడు మూగజీవి పట్ల అమానవీయంగా వ్యవహరించారు. రాజస్థాన్ లోని జోథ్పూర్ లో డాక్టర్ రజనీష్ గల్వా ఇంటి వద్ద ఉన్న వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. పైశాచికంగా వ్యవహరించాడు. తన ఇంటి వద్ద మొరుగుతుందని, అరుపులు భరించలేక ఆ డాక్టర్ కారుకు కుక్కను కట్టి ఊరంతా తిప్పాడు. ఐదు కిలోమీటర్లు అలాగే తీసుకెళ్లాడు. కారు వేగంతో పరుగెత్తలేక పోతున్న ఆ కుక్కను చూసి ఒక యువకుడు కారును ఆపి దానిని విడిపించారు.
జంతుహింస కేసు...
అరవ కుండా ఆ కుక్క మూతికి తాడు కట్టాడు. ఆ కుక్క మూతికి ఉన్న తాడును తొలగించిన యువకుడు వెంటనే డాగ్ హోం సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ కుక్కను తీసుకెళ్లారు. ఈ ఘటనపై డాక్టర్ పై డాగ్ హోం ఫౌండేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాక్టర్ రజనీష్ గల్వా పై జంతుహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story