Tue Dec 24 2024 02:14:37 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఐటీ దాడులు
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జీ స్క్వేర్ సంస్ధపై దాడులు నిర్వహిస్తుంది
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జీ స్క్వేర్ సంస్ధపై దాడులు నిర్వహిస్తుంది. జీ స్క్వేర్ సంస్ధ తమిళనాడు, కేరళ, ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఎదగడానికి డీఎంకే నేతలు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
జీ స్క్వేర్ సంస్ధపై...
గతంలోనూ జీ స్క్వేర్ సంస్ధ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. 433 కోట్ల ఆస్తులు లెక్కల్లో లేనట్లు గుర్తించింది. ఈసారి కూడా అదే తరహాలో పన్నులు ఎగవేత, లెెక్కల్లో లేకుండా ఆస్తుల కొనుగోలు వంటి అంశాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Next Story