Sun Dec 14 2025 06:02:58 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : తమిళనాడులో కార్యకర్తలకు బంపర్ ఆఫర్.. గోల్డ్ కాయిన్
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ విన్నూత్నంగా క్యాడర్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ విన్నూత్నంగా క్యాడర్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగాంగా కార్యకర్తల్లో ఎంపిక చేసిన వారికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. మూడు వందల మందికి ఉచితంగా ఎలక్ట్రిక్ కుక్కర్లు, గృహోపకరణాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. తమిళనాడులోని తిరువూరు జిల్లా ఉత్తకూరిలో ఎల్లుండి అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశం జరుగుతుంది.
గృహోపకరణాలు...
ఈ సమావేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి గోల్డ్ కాయిన్ ఇస్తామని పార్టీ నాయకత్వం ప్రకటించింది. అలాగే మూడు వందల మందికి గృహోపకరణాలను ఇస్తమనితెలిపింది. దీంతో ఈ సభకు పెద్దసంఖ్యలో అన్నా డీఎంకే కార్యకర్తుల హాజరయ్యే అవకాశాలున్నాయి. తోపులాట జరిగే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
Next Story

