Mon Dec 23 2024 03:52:01 GMT+0000 (Coordinated Universal Time)
వీళ్లంతా పోలీసులే.. విధులు చేస్తన్న వారే... పూజారుల దుస్తుల్లో
వారణాసిలో పోలీసులు పూజారుల దుస్తుల్లో విధులు నిర్వహించడం విమర్శలకు తావిస్తుంది.
వారణాసిలో పోలీసులు పూజారుల దుస్తుల్లో విధులు నిర్వహించడం విమర్శలకు తావిస్తుంది. వారణాసిలోని ఆలయం లోపల పోలీసులకు పూజారుల దుస్తులు ధరింపచేయడాన్ని పలువురు నిరసిస్తున్నారు. కాశీ విశ్వనాధ ఆలయంలోనే ఎందుకు ఈ ప్రత్యేకత అంటూ సమాజ్ వాదీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీసులను పూజారుల దుస్తుల్లో నియమించడం వివాదంగా మారింది.
అఖిలేష్ అభ్యంతరం...
దీనిపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గట్టిగానే ప్రశ్నించారు. ఏ నియమావళి ప్రకారం పోలీసులకు పూజారులు దుస్తులు ధరించేలా ఉత్తర్వులు జారీ చేశారని ఆయన నిలదీశారు. పోలీసులంటే వారికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుందని, దానిని కాదని ఇలా పూజారుల వేషం వేస్తే ఆలయం లోపల ఈ వేషాలేంటి? అంటూ ఆయన ట్విట్టర్ లో ప్రశ్నించారు.
Next Story