Mon Dec 23 2024 02:18:07 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : హోటల్ గది రోజుకు లక్ష... ఎప్పుడూ లేనంత డిమాండ్
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం వచ్చ నెల 22వ తేదీన జరగనుంది. హోటల్ గది రోజుకు లక్ష రూపాయలకు చేరుకుంది
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం వచ్చ నెల 22వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేసింది. ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. దీంతో ఆరోజు లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటారని భావిస్తున్నారు. వచ్చే భక్తులకు కావాల్సిన వసతి సౌకర్యాలపై కూడా ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
అడ్వాన్స్ బుకింగ్...
అయితే ఇప్పటికే ప్రయివేటు హోటళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయోధ్యలోని అన్ని హోటళ్లు ఆరోజుకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఒక్కొక్క హోటల్ రూం లక్ష రూపాయలకు పైగానే ధర పలుకుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో పాటు తమకు డిమాండ్ ఉన్నప్పుడే ధరలు పెంచుతామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. అయోధ్య నగరంలో అతి తక్కువ హోటల్స్ ఉండటం కూడా ఇది కారణమే. స్టార్ హోటళ్లు తక్కువే. మూడు నాలుగుకు మించి లేవు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రోజుకు లక్ష రూపాయలంటే గతంలో ఎన్నడూ లేని ధర పలుకుతుందని నిర్వాహకులు అంగీకరిస్తున్నారు.
లక్షల సంఖ్యలో...
పోలీసులు కూడా గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ఆరోజు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వీవీఐపీలు కూడా వస్తుండటంతో అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడిని నిశితంగా పరిశీలించిన అనంతరమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. చాలా రోజుల తర్వాత అయోధ్య శ్రీరామ దర్శనం అవుతుండటంతో భక్తులు ఇదే ముహూర్తానికి వచ్చేందుకు ప్లాన్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో బీజేపీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.
Next Story