Mon Dec 23 2024 14:27:39 GMT+0000 (Coordinated Universal Time)
Train : ఆగి ఉన్న రైలులో మంటలు.. పేలిన సిలిండర్లు...అయితే అదృష్టవశాత్తూ
రైలు బోగీలో మంటలు అంటుకుని మూడు సిలిండర్లు పేలిన ఘటన హర్యానాలో జరిగింది.
రైలు బోగీలో మంటలు అంటుకుని మూడు సిలిండర్లు పేలిన ఘటన హర్యానాలో జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హర్యానాలోని అంబాలా సిటీ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీ నుంచి ఒక్కసారిగా వచ్చిన మంటలు రైలు అంతటా వ్యాపించింది. అయితే రైలు ఆగి ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ రైలును రైల్వే ఉద్యోగుల కోసం కేటాయించిందని అధికారులు తెలిపారు.
వంట చేస్తుండగా..
రైల్వే సిబ్బంది వంట చేసుకునే సమయంలో సిలిండర్ పేలడంతో అందులో ఉన్న మిగిలిన రెండు సిలిండర్లకు కూడా నిప్పంటుకుని అవి కూడా పేలాయి. దీంతో ఆ బోగీలో పెద్దయెత్తున మంటలతో పాటు పేలుడు శబ్దం కూడా వినిపించింది. ప్లాట్ఫారం పై ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను అదుపు చేయడానికి చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే మంటలు అంటుకున్న సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు.
Next Story