Mon Dec 23 2024 16:06:57 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ లో చేరనున్న మహారాష్ట్ర నేతలు
భారత రాష్ట్ర సమితిలో చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు నేడు బీఆర్ఎస్ లో చేరనున్నారు.
భారత రాష్ట్ర సమితిలో చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు నేడు బీఆర్ఎస్ లో చేరనున్నారు. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. నిన్న రాత్రి ప్రగతి భవన్ చేరుకున్న మహారాష్ట్ర నేతలు కేసీఆర్ తో చర్చించారు. ఆయన వారికి బీఆర్ఎస్ ఎందుకు ఏర్పాటయింది? దాని లక్ష్యాలేంటి? భవిష్యత్ ప్రణాళికలను వారికి వివరించారు.
నేడు నాందేడ్ లో...
దీంతో వారు బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈరోజు నాందేడ్ లో జరిగే బహిరంగ సభలో వీరి చేరికలు ఉంటాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాందేడ్ సభ మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకువస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
Next Story