Mon Dec 23 2024 05:04:22 GMT+0000 (Coordinated Universal Time)
ఒడిశా ప్రమాద బాధితులకు రూ.10కోట్లు ఇస్తా : జైలు నుండి సుఖేష్ లేఖ
రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు కోసం ఆ మొత్తాన్ని వినియోగించాలని విజ్ఞప్తి చేశాడు.
వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో విచారణ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ప్రియురాలిగా చెప్పుకునే ఓ హీరోయిన్ కు ప్రేమలేఖలు రాస్తుంటాడు. తాజా ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం చేస్తానంటూ ప్రకటన చేశాడు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయంగా రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశాడు. రూ.10 కోట్లను విరాళంగా బాధితులకు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు.
వ్యక్తిగతంగా, చట్టబద్ధంగా సంపాదించిన మొత్తాన్ని బాధితులకు ఇస్తానని పేర్కొన్నాడు. రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు కోసం ఆ మొత్తాన్ని వినియోగించాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘మన ప్రభుత్వం ఇప్పటికే బాధిత ప్రజలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తోంది. ఒక బాధ్యతాయుతమైన, మంచి పౌరుడిగా.. రూ. 10 కోట్లను ఆ కుటుంబాలు/పిల్లలు, భావి యువత కోసం ప్రత్యేకంగా వినియోగించే నిధిగా అందిస్తున్నాను. తమ ప్రియమైన వ్యక్తిని/కుటుంబాన్ని పోషించే వారిని కోల్పోయిన వారి చదువుల ఖర్చుల కోసం కేటాయించాలని కోరుతున్నా’’ అని లేఖలో రాసుకొచ్చాడు సుఖేష్ చంద్రశేఖర్.
Next Story