Thu Dec 19 2024 14:04:07 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరులో ఐటీ సోదాలు.. ఆ రెండు రాష్ట్రాలకు డబ్బులు?
బెంగళూరులో పెద్దయెత్తున ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి
బెంగళూరులో పెద్దయెత్తున ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. దాదాపు ఇరవై చోట్ల ఈ తనిఖీలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన అధికారులు పెద్దయెత్తున తనిఖీలు చేస్తుండటంతో బెంగళూరు పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతల్లో కలవరం మొదలయింది. ఉదయం నుంచే ఈ సోదాలు మొదలయ్యాయి.
ఎన్నికలకు....
రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు బెంగళూరు నుంచే పెద్దమొత్తంలో నగదును కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని వచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని తెలిసింది. వంద మందికి పైగా అధికారులు ఇరవై బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహిస్తుండటం విశేషం.
Next Story